నేషనల్  కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జిల్లా ఛైర్మెన్ గా మౌనిక తిరుపతి యాదవ్

నేషనల్  కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జిల్లా ఛైర్మెన్ గా మౌనిక తిరుపతి యాదవ్

ముద్ర,పానుగల్:- ది నేషనల్  కన్స్యూమర్ రైట్స్ కమిషన్ వనపర్తి జిల్లా ఛైర్మెన్ గా పానుగల్ మండలంలోని శాగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆకునమోని మౌనిక తిరుపతి యాదవ్ నియామించినట్లు తెలంగాణ స్టేట్ ఛైర్మెన్ వల్దాస్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.వినియోగదారులకు సేవలు అందించాలని  ఉద్దేశంతో వినియోగదారులకు చట్టపరంగా ఉన్న హక్కుల పట్ల అవగాహన లేక అనేక మంది నష్ట పోతున్నారని అంటువంటి వారి పక్షాన పోరాడి న్యాయం అందే విధంగా చూడడమే  తమ లక్ష్యం అని ఆమె తెలిపారు.

త్వరలో హైదరాబాద్ సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని తెలిపారు.ది నేషనల్  కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జిల్లా ఛైర్మెన్ గా మౌనిక తిరుపతి యాదవ్ ను నియమించడం పట్ల శాగాపూర్ గ్రామ ప్రజలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,మండల స్థాయి బిఆర్ఎస్  పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు