రైతును కన్నీరు పెట్టిస్తున్న ఎర్ర బంగారం

రైతును కన్నీరు పెట్టిస్తున్న ఎర్ర బంగారం
red gold

ఎర్ర బంగారం పండించిన రైతులు వారి పొలాల్లో  పండించిన పంటను ఆరబోయడంతో, అది భూమికి ఎర్రని రంగేసినట్లు కనువిందుగా కనిపిస్తున్నది. ఈ ఏడాది ఎర్ర బంగారం (మిరప) సాగు చేసుకున్న రైతులు తెగుళ్ల బెడదతో భారీగా దిగుబడి తగ్గడం వల్ల లాబోదిబో మంటున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది మిరప సాగు చేసుకోగా నల్ల పురుగు తెగులు సోకడంతో విపరీతంగా రసాయన ఎరువులు వాడాల్సి వచ్చిందని, దీనితో సాగు ఖర్చు భారీగా పెరిగి, దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 70 వేల నుండి లక్ష రూపాయల వరకు మందులకే ఖర్చ అయ్యాయానీ అన్నారు. గతంలో ఎకరాకు 16 క్వింటాళ్ల మిరప పంట చేతికి రాగా ఈ ఏడాది ఎకరాకు 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని రైతులు తెలిపారు. ధర బాగా ఉండటంతో కొంతమేర అప్పుల నుండి బయటపడ్డామని రైతులు అన్నారు. క్వింటాలుకు 25 నుండి 26 వేల రూపాయల ధర పలుకుతుందని తెలిపారు.