గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న బీరం విజయమ్మ

గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న బీరం విజయమ్మ

ముద్ర.వీపనగండ్ల: మండల కేంద్రమైన వీపనగండలో దీపావళి పండుగ సందర్భంగా కొల్లాపూర్ బరాస పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సతీమణి బీరం విజయమ్మ గంగమ్మ దేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీరం విజయమ్మ గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్, బరాస పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, నాయకులు కరుణాకర్ రెడ్డి, ముంత శివ యాదవ్, మహిళా నాయకురాలు బొమ్మిరెడ్డి జయంతి తదితరులు ఉన్నారు.