ఎన్నికల ప్రచారంలో మంత్రి సతీమణి, కూతుర్లు

ఎన్నికల ప్రచారంలో మంత్రి సతీమణి, కూతుర్లు

ముద్ర ప్రతినిధి, వనపర్తి : మంత్రి నిరంజన్ రెడ్డిని మరోసారి గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చెందడానికి బాటలు వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి, కూతుర్లు డాక్టర్ ప్రత్యూష తేజస్విని అన్నారు. శుక్రవారం ఖిలా గణపురం మండలం సోలిపూర్ గ్రామంలో వారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక చొరవతో సోలిపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని  గ్రామ ప్రజలకు వివరించారు. ముందుగా గ్రామంలోని ప్రతి  ఇంటింటికి వెళ్లి  గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ   కారు గుర్తుకు ఓటు వేసి  మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను విజ్ఞప్తి చేశారు. సోలిపూర్ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకొని రావడం జరిగిందని వారు వివరించారు. రూ 3 లక్షలతో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ పనుల  నిర్మాణం, రూ 3 లక్షలతో వాల్మీకి కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ వర్క్ నిర్మాణం, రూ 50 లక్షలతో సోలిపూర్ నుండి కోతలకుంట  తండా వరకు బిటి రోడ్డు నిర్మాణం, రూ 11కోట్ల 86 లక్షలతో 236 నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం, రూ 20 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణం, రూ 5 లక్షలతో యూత్ భవనం నిర్మాణం, రూ 4 లక్షలతో సబ్ సెంటర్ నిర్మాణం, రూ 5 లక్షలతో యాదవ భవన నిర్మాణం, రూ కోటి 28 లక్షల 90 వేలతో 33 సిసి రోడ్ పనులు ఇలా ఎన్నో పనులు చేయడం జరిగిందని అభివృద్ధి పనులన్నీ మీ కండ్ల ముందు ఉన్నాయన్నారు. గత ఎన్నికల్లో మించిన మెజారిటీ అందించి మరోసారి అవకాశం ఇవ్వాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫారం సలహా మండలి సభ్యలు లక్ష్మారెడ్డి,  సర్పంచ్ పద్మ శ్రీ, మార్కెట్ వైస్ చైర్మన్ బాలేశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పురేందర్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘం సభ్యులు పురుషోత్తం, తదితర నాయకులు పాల్గొన్నారు.