గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు ఖాయం - సర్పంచ్  చిట్టిరెడ్డి రాజిరెడ్డి 

గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు ఖాయం - సర్పంచ్  చిట్టిరెడ్డి రాజిరెడ్డి 
ముద్ర, శాయంపేట : మండలంలోని పత్తిపాక గ్రామంలో 2,3,7 వార్డులో  సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి నాయకత్వంలో సుమారు 100మంది బిఆర్ఎస్  కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో  ప్రతి ఒక్క ఓటరుని కలిసి మాట్లాడి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మన గ్రామం బిఆర్ఎస్ ప్రభుత్వoలో గండ్ర దంపతుల సహకారంతో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, మరింత అభివృద్ధి జరగాలంటే మళ్ళీ రమణరెడ్డిని భారీ మెజార్టీతోని గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి జరగాలంటే గండ్ర దంపతులతోనే సాధ్యమని ఓటర్లకి చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు