70 ఏళ్లు గా తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు

70 ఏళ్లు గా తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు
  • కాంగ్రెస్ లో చేరిన వారి రాజకీయ జీవితం పరి సమాప్తం..
  • వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి అండగా పలువురు బీఆర్ఎస్ లో చేరిక

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే , బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డికి అండగా పలువురు ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.   కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష, పైలెట్ నాయకత్వమే తాండూరుకు రక్ష అని తాండూరు మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు. శుక్ర వారం యలాల మండలం నాగసముందర్, రాఘవాపూర్, సంగాయి గుట్ట తండా, తాండూరు మండలం కోటబాస్పల్లి, పెద్దెముల్ మండలం జనగాం, బషీరాబాద్ మండల ఎక్మయి గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తోనే తాండూరు భవిష్యత్ కు బాటలన్నారు. 70 ఏళ్లుగా తెలంగాణ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదనీ వారు అన్నారు. డబ్బులకు ఆశపడి కాంగ్రెస్ లో చేరిన వారి రాజకీయ జీవితం పరి సమాప్తం. మళ్ళీ తాండూరులో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అని ,మళ్లీ తాండూరు ఎమ్మెల్యేగా అయ్యేది
పైలెట్ రోహిత్ రెడ్డి అని అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డిని
 భారీ మెజారిటీ గెలిపించుకుంటామని వారు తెలిపారు.