మద్యం, డబ్బులు తరలించకుండా సహకరించాలి  

మద్యం, డబ్బులు తరలించకుండా సహకరించాలి  

జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి కర్ణాటక రాష్ట్ర కలబురిగి కలెక్టర్  , ఎస్పీలతో సమావేశం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అక్రమంగా మద్యం, డబ్బులు తరలించకుండా సహకరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి కర్ణాటక రాష్ట్ర కలబురిగి కలెక్టర్  , ఎస్పీలను కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి కర్ణాటక రాష్ట్ర కలబురిగి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.  ఈ సమావేశంలో సంగారెడ్డి, నారాయణపేట జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ,   కర్ణాటక రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాలలో శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు  7 కర్ణాటక రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం, డబ్బులు తరలించకుండా సహకారం అందించాలని కోరారు.   జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ, గతంలో  కర్ణాటక శాసనసభ ఎన్నికలలో 7 చెక్పోస్టుల వద్ద ఎలాంటి అక్రమ తరలింపులు జరగకుండా పటిష్టమైన నిఘా  చేపట్టి సహకరించడం జరిగిందని గుర్తు చేస్తూ, అదేవిధంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కర్ణాటక సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసి మద్యం డబ్బులు గంజాయి తరలించకుండ కలబురిగి కలెక్టర్, ఎస్పీలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కలబురిగి కలెక్టర్ మాట్లాడుతూ, తమ ప్రాంతం నుండి ఎలాంటి మద్యం, డబ్బు,, గంజాయి తలంచకుండా చెక్ పోస్ట్ ల వద్ద 24 గంటల గట్టి నిఘా ఏర్పాటు చేసి కూబింగ్ నిర్వహించి సహకరించడం జరుగుతుందని అన్నారు.

ఎపిక్ కార్డల పంపిణీపై పోస్టల్ అధికారులతో సమావేశం
 అనంతరం జిల్లా ఎన్నికల అధికారి పోస్టల్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నియోజక వర్గాలకు సంబంధించిన కొత్త ఓటరు గుర్తింపు కార్డులు 1.20 లక్షలు వేగవంతంగా పంపిణీ చేయాలని అన్నారు.  ఈనెల 20 లోగా ఓటర్లు అందరికీ ఎపిక్ కార్డులు అందజేసేందుకు రెవెన్యూ అధికారుల సహకారంతో వేగవంతంగా పంపిణీ చేయాలని అన్నారు.  ఈ సమావేశంలో యంసిసి నోడల్ అధికారి కృష్ణన్,  ఎక్స్పెండిచర్ మోడల్ అధికారి శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.