మానవత్వం చూపిన వికారాబాద్ పోలీసులు

మానవత్వం చూపిన వికారాబాద్ పోలీసులు

ముద్ర, ప్రతినిధి వికారాబాద్ : ఓ వృద్ధురాలిని వారి కుటుంబీకులు గుడి దగ్గర వదిలేసి వెళ్లిపోగా విషయం తెలుసుకున్న పోలీసులు మానవత్వం కనబరిచారు. వివరాల్లోకి వెళితే... వికారాబాద్ జిల్లా కొత్తగాడి సమీపంలో గల మైసమ్మ దేవాలయం వద్ద గత రెండు రోజుల క్రితం మంగలి రాములమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలి నీ వాహనంలో తీసుకువచ్చి ఆమెతోపాటు ఆమె దుస్తులను, ఆధార్ కార్డును విడిచి వెళ్లిపోయారు. రెండు రోజులుగా సమయానికి తిండి లేక ఆ వృద్ధురాలు అల్లాడుతూ ఇక ఆత్మహత్య శరణ్యమని బోరున విలపించడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వికారాబాద్ పట్టణ సీఐ టంగుటూరి శ్రీను, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశీలించగా వృద్ధురాలి ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న వెంటనే ఆసుపత్రిలో చికిత్స చేయించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా మమ్ దాన్ పల్లి గ్రామంలో పోలీసులు విచారించినప్పటికీ ఆమెకు సంబంధించిన వారు గ్రామంలో ఉండరు అని తెలిసింది. ఈ సంఘటన దృశ్య పట్టణ సీఐ టంగుటూరి శ్రీను మాట్లాడుతూ...
కనిపెంచిన తల్లిదండ్రుల్నీ, కుటుంబంలోని ఇతర వయోవృద్ధుల్నీ వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయటం హేయమైన విషయం. బిడ్డల్ని పెంచీ, వారికి విద్యాబుద్దులు నేర్పించి, తద్వారా ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు.