చేవెళ్లకు చేయూత రంజిత్​ రెడ్డి

చేవెళ్లకు చేయూత రంజిత్​ రెడ్డి

గ్రేటర్ ను ఆనుకుని ఉన్న చేవెల్ల పార్లమెంట్​నియోజకవర్గంలో ఎంపీ రంజిత్​రెడ్డి పనితీరుకు ఇక్కడి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన చేవెళ్ళ గడ్డ రుణం తీర్చుకునేందుకు ఆయనలా కృషి చేసిన ఎంపీ ఈ ప్రాంతంలోనే ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. పవర్ ను ఎంజాయ్​ చేసే పొలిటిషియన్​ తరహాలో కాకుండా.. రంజిత్​ రెడ్డి అందుకు పూర్తిగా విభిన్నంగా.. సొంత నిధులతో కూడా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో అభివృద్ధి, అందుబాటు అనే నినాదంతో చేవెళ్ళ జనంలోకి వచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు మాత్రమే పరిమితం కాకుండా.. ఇవ్వని హామీలు కూడా ఎన్నో చేశారు.


ప్రధానంగా ఇటీవల రంజితన్న చేపట్టిన ఆరోగ్య చేవెళ్ల కార్యక్రమం ఈ ప్రాంతం ప్రజలకు చేరువైంది. ఇంటింటికి వైద్యం..  గడప గడపకి ఆరోగ్య రథం” అనే సేవా కార్యక్రమాన్ని తన పార్లమెంట్​ నియోజకవర్గంలో స్వచ్ఛంధంగా, ఉచితంగా చేపట్టారు. రాజకీయ నాయకుడంటే ల్యాండ్​ గ్రాబింగ్, స్యాండ్​ మైనింగ్, ధన దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గపు దుష్టాంతాలు చేయాలన్న అభిప్రాయానికి సగటు జనమంతా వచ్చిన నేటి తరుణంలో రంజిత్​రెడ్డి మాత్రం తనకు అండగా నిలిచిన జనం కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. నాయకుడు లేని సమాజాన్ని సృష్టించడమే నిజమైన నాయకుడి లక్ష్యమనే సోషలిస్టు సిద్ధాంతపు మాటలను నిజం చేస్తున్న రంజిత్​రెడ్డిని చూస్తే.. ప్రజా నాయకుడే గుర్తుకు వస్తున్నారు. 


వెటర్నరీ డాక్టర్​గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రంజిత్​రెడ్డి.. హెచరీస్​ రంగంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ప్రజా సేవా చేయాలన్న సంకల్పంతో 2019లో రాజకీయాల్లో వచ్చారు. అప్పుడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచన మేరకు చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి ప్రతి పనిలో అందుబాటులో ఉండటం ద్వారా రంజిత్​రెడ్డి తన మార్కు రాజకీయాన్ని విశదీకరించారు. తనకు విద్యాబుద్ధులు నేర్పించడంలో ఎంతగానో కష్టపడి, పరితపించిన తన తండ్రి రాజారెడ్డి సంస్మారణార్థం తన సతీమణి సీతా రెడ్డి నేతృత్వంలో సాగే ఆర్​ఆర్​ ఫౌండేషన్​ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికీ  నిర్వహిస్తూనే ఉన్నారు. వందల వేలాది మంది వికలాంగులకు ట్రై సైకిల్స్​, పేదల ఆరోగ్యానికి వందలాది అంబులెన్సెలు​ అందజేసి తనలో మానవీయతను చాటుకున్నారు. ఇక కరోనా సమయంలో విద్య విలువ తెలిసిన ఒక బాధ్యతగల నేతగా తన పార్లమెంట్​ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ విద్యార్థికి చదువుకు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రభుత్వ స్కూలు పిల్లలు ఆ టీవీల ద్వారా పాఠాలు వినాలని ప్రయత్నించిన ఎంపీ ఒక్క రంజిత్​ రెడ్డి మాత్రమే. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా, కనీస సమయం ఇవ్వకుండా విధించిన లాక్​డౌన్​లో పేద ప్రజలు, వలస కార్మికులు ఇబ్బంది పడకుండా ఉండాలని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేలాది మందికి రేషన్​ సరకులు, ఆహార పొట్లాలు స్వయంగా తయారు చేయించి  అందజేశారు. ఇటీవల కాలంలో కూడా చేవెళ్ళ పరిధిలోని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్​లు, వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. 

ఆరోగ్య చేవెళ్ల
ముందుగా తన నియోజకవర్గ పరిధిలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారంతా ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేని వాళ్లందరికీ ఒకే ఒక్క పథకంతో వైద్య సేవలను దగ్గరకు చేర్చారు. అదే ఆరోగ్య చేవెళ్ళ రథ కార్యక్రమం. ఆసుపత్రి స్వరూపం ఉన్న ఒక బస్సును తయారు చేయించి, పేద ప్రజలు ఉండే గ్రామాలు, బస్తీలకు పంపి వారికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తూనే ఉన్నారు. పేద ప్రజలు ఉండే ప్రదేశానికి వైద్యులు, పారామెడికల్​ సిబ్బంది, సపోర్టింగ్​ స్టాఫును తీసువెళ్ళి సేవలు అందించడం ఒక బృహత్తరమైన కార్యం. అటువంటి భారీ స్థాయి కార్యక్రమాన్ని అమలు చేసేప్పుడు వచ్చే ఇబ్బందులకు సంబంధిత టీంకు ఆయన ఇచ్చే ప్రోత్సాహం నిజంగా మరవలేనిది. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పొందుతూ షుగర్​, బీపీ పరీక్షలను స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున  చేయించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కవ మంది బీపీ, షుగర్​, హై కొలెస్ట్రాల్​ వంటి లైఫ్​ స్టైల్​ రోగాలు ఉన్నా, ఆ విషయం వారికి తెలిసి రావడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా అవగాహనకు వస్తున్నాయి. దాంతోపాటు, ఇక్కడ తెలియవలిసిన ముఖ్య విషయం ఏమిటింటే… ఆరోగ్య రథ కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు నాయకులు కూడా టెస్టు చేయించుకుంటే చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కూడా బీపీ రెండు వేర్వేరు సందర్భాల్లో ఎక్కువగా నమోదు అయిందంటే మనలోని  చాలామంది ఆరోగ్యమంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో అవగతం చేసుకోవచ్చు. అయితే, ఈ నిర్లక్ష్యాన్ని నిలువునా ఖండించాలని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధతో ఉండాలన్న సంకల్పంలో భాగంగా రంజిత్​ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

111 జీవో ఎత్తివేతకు పట్టు
సీఎం కేసీఆర్​ దగ్గర 111 జీవో ఎత్తివేతకు పట్టుబట్టిన వ్యక్తి ఎంపీ రంజిత్​రెడ్డి, 111 జీవో ఎత్తివేతతో ఈ చుట్టూరా ప్రజలకు చాలా ప్రయోజనాలు కల్గుతున్నాయి. 84 గ్రామాల పరిధిలో 111 జీవో ఎత్తివేతతో నగరానికి ఆనుకొని ఉన్న ఇతర ప్రాంతాల్లో మాదిరిగా అభివృద్ధి పరుగులు పెడుతుంది. దాని పరిధిలోని 1,32,600 ఎకరాల్లో ఉన్న రైతులకు లబ్ధి చేకూరనుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఎలాంటి నిబంధనలు అమలవుతున్నాయో అవే ఇక్కడ కూడా అమలు కానున్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగానికి సులభతరంగా అనుమతులు వస్తాయి.


వ్యవసాయ, వినోద జోన్లకు మాత్రమే పరిమితమైన ఈ భూములు అన్ని జోన్ల పరిధిలోకి వస్తాయి. రైతులు తమ భూముల్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు వస్తుంది. తద్వారా భూముల విలువ ఇప్పటికంటే అనేక రెట్లు పెరుగుతుంది. నగరానికి చేరువలో ఉండటంతో ఆంక్షల ఎత్తివేతతో నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు ఈ గ్రామాలు వేదికగా మారి అనేక కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు వస్తాయి. ఆకాశహర్మ్యాలు వెలుస్తాయి. అప్పా జంక్షన్​ నుంచి మన్నెగూడు వరకు 42 కి.మీ నాలుగు లైన్ల రోడ్లు రూ.1,000 కోట్లు మంజూరు చేయించిన ఘనత కూడా రంజిత్​ రెడ్డిదే. సిక్​ చావన్​ని కాలనీ వాసులు ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు, చేవెళ్ళను మున్సిపాలిటీగా ప్రకటించి,  దాని అభివృద్ధిని స్వయంగా భుజాలపై వేసుకున్నారు. రాయదుర్గ్​ నుంచి శంషాబాద్​ విమానాశ్రయం వరకు మెట్రో రైలు సేవలు విస్తరణకి కృషి చేశారు. తన సొంత నిధులతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో అంబులెన్స్​ గిఫ్ట్​ ఏ స్మైల్​ కింద ఇచ్చారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఈ ఆంబులెన్స్​లే కనిపిస్తున్నాయి. 104 మంది దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ళను పంపిణీ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చేవెళ్ల ప్రజల కోసం ఆయన చేసిన కృషి చాలా పెద్దది. 

సాగర్​ వనపర్తి,
సీనియర్​ జర్నలిస్టు,
9494041258.