బెజ్జంకి వద్ద లారీ మంథని ఆర్టీసీ బస్ ఢీ

బెజ్జంకి వద్ద లారీ మంథని ఆర్టీసీ బస్ ఢీ
  • అదుపుతప్పి పురోలోకి దూసుకెళ్లిన బస్సు..
  • డ్రైవర్ కు తీవ్ర గాయాలు ప్రయాణికులు స్వల్ప గాయాలు
  • మూడు గంటల పాటు క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-సిద్దిపేట జిల్లా హైదరాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారి బెజ్జంకి స్టేజీ మూలమలుపు వద్ద పెద్దపెల్లి జిల్లా మంథని ఆర్టీసీ డిపో బస్సు ఎదురుగా వస్తున్న లారీ ని తప్పించబోయి శనివారం తెల్లవారుజామున బస్ పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. రెండు కాళ్లు విరుగగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బస్ లో ఉన్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆయన వివరాలు తెలియాల్సిన ఉంది.

బస్సు ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ మూడు గంటల పాటు క్యాబిన్ లో ఇరుక్కుని నరకయాతన అనుభవించాడని స్థానికులు తెలిపారు. ఎట్టకేలకు స్థానికులు క్యాబిన్ నుంచి బయటకు తీసి డ్రైవర్ ను, ప్రయాణికులను దవఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మీగిత ఎవరికి కూడా పెద్దగా గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలానికి చెందిన డ్రైవర్ శ్రీనివాస్ గా గుర్తించారు.