కాంగ్రెస్ పార్టీలో చేరిన కాజీపేట మల్లేష్ - పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

కాంగ్రెస్ పార్టీలో చేరిన కాజీపేట మల్లేష్ - పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు కాజీపేట మల్లేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మల్లేష్ కు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి   ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేస్తానని నియోజకవర్గంలో పర్యటించి శ్రీధర్ బాబు  గెలుపు కోసం అహర్నిశలు కష్టపడతనన్నారు.