అంతా మా ఇష్టం మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు...

అంతా మా ఇష్టం మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు...
  • రైతులు మీ భూములు  ఇచ్చుడు ఇష్టం లేకుంటే కోర్టుకు వెళ్ళండి
  • ముత్తారంలో భూ నిర్వాసితులతో మంథని ఆర్డీఓ హనుమా నాయక్ సమాధానం పై రైతులు ఆగ్రహం


ముద్ర ముత్తారం: అంతా మా ఇష్టం... మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు... ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ మాత్రమే మేము పాటిస్తామని, రైతులు మీకు భూములు ఇచ్చుడు ఇష్టం లేకుంటే కోర్టుకు వెళ్ళండని, అంతేగాని మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని  ముత్తారంలో భూ నిర్వాసితులతో మంథని ఆర్డీఓ హనుమా నాయక్ సమాధానం చెప్పడంతో రైతులు తీవ్ర దిగ్భ్రాంతి గురై ఆగ్రహం వ్యక్తం చేశారు.  జాతీయ రహదారి (ఎన్ హెచ్- 163) కింద భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం ముత్తారం గ్రామ పంచాయతీలో మంథని ఆర్డీఓ హనుమాన్ నాయక్ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.

 కానీ ఈ సమావేశానికి భూములు కోల్పోతున్న గ్రామంలోని రైతులు సమావేశం కాడికి వచ్చేసరికి ఆర్డీఓ తో పాటు అధికారులు సమావేశం ముగిసిందని చెప్పి వెళ్ళిపోతుండడంతో రైతులు భూ నిర్వాసితులు ఆర్డీవోతో మాకు తగిన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని లేకుంటే భూములు ఇచ్చేది లేదని రైతులు తెలుపగా, రైతులకు  సమాధానం చెప్పాల్సిన ఆర్డీఓ ఆగ్రహంతో మాట్లాడుతూ మీ ఇష్టం ఉంటే ఇవ్వండి... లేకుంటే కోర్టుకు వెళ్ళండి,  అంతేగాని నేను చెప్పేదేమీ లేదని దురుసుగా భూ నిర్వాసితులతో మాట్లాడి వెళ్లిపోయాడని రైతులు మీడియాతో మాట్లాడుతూ వాపోయారు. గత సంవత్సరం 14-6-2003 రోజున కూడా భూములు కోల్పోతున్న నిర్వాసితులతో ఆర్డీవో సమావేశం ఏర్పాటు చేశాడని, అప్పుడు తమకు మార్కెట్ లెక్క ప్రకారం భూములకు రేటు కట్టి న్యాయం చేయాలని కోరగా,  అలాగే రెవెన్యూ అధికారులు చేసిన సర్వేలో తప్పులు జరిగాయని అర్జీలు చేసుకున్నామని వాటిని పరిశీలించి మీకు న్యాయం చేస్తానని చెప్పి వెళ్లిపోయిన ఆర్డీవో ఇప్పటివరకు వాటిపై పరిశీలన జరిపి మాకు న్యాయం చేయలేదని రైతులు ఆవేదన వ్యక్థం చేశారు. తమ తాతల ముత్తాతల నుంచి భూములనే నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని, మా జీవనాధారమైన భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయమని అడుగుతే రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ  తమను చిన్నచూపు చూస్తూ కోర్టుకు పో అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తమ భూములలో సర్వే చేయనీయమని తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తే తప్ప తమ భూములు ఇస్తామని, లేకుంటే ప్రాణాలు పోయినా కూడా తమ భూములు ఇచ్చి మా బ్రతుకులను నాశనం చేసుకోలేమని రైతులు కారకండిగా తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆర్డీవో పై చర్యలు తీసుకోని, తమకు న్యాయం చేయాలని భూ నిర్వాసితుల రైతులు  పి. సుధాకర్ రెడ్డి, నూనెటి సాయి కృష్ణ, ఎం లింగమ్మ, ఎ.  మధునయ్య, తాటిపాముల శంకర్, శ్రీను,  కమల,  వీరారెడ్డి, రాజమల్లు, పింగిలి ప్రభాకర్ రెడ్డి, మందల శ్రీనివాస, స్రవంతి, పందుల రాజు, స్పష్టం కోరారు.