తెల్లారకముందే సొంత గూటికి  ధన్వాడ సర్పంచ్ నరేష్..

తెల్లారకముందే సొంత గూటికి  ధన్వాడ సర్పంచ్ నరేష్..

మళ్లీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, పెద్దపెల్లి : ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు చేస్తున్న చిత్ర విచిత్రాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం,  సాయంత్రం జంపు జిలానీలు ఆ పార్టీలో కి ఈ పార్టీలోకి జంపు చేస్తున్నారు. ఈ నాయకులను చూసి జనాలు కళ్ళు మూసుకుంటున్నారు. ఉదయం ఓ పార్టీలో చేరిన అ ప్రజా ప్రతినిధి  సాయంత్రం మరో పార్టీలకచ్చి పార్టీ కండువలు కప్పుకుంటున్నారు. ఇదే రీతిలో మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడ సర్పంచ్ నరేష్ గురువారం సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సర్పంచ్ నరేష్ తన మనుసు మార్చుకుని  తెల్లవారక ముందే అర్ధరాత్రి మళ్లీ శ్రీధర్ బాబు సమక్షంలో తన సొంత గూటికి చేరుకొని అందరిని షాక్కు గురిచేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రజలు ఈ నాయకులను చూసి నవ్వుకుంటున్నారు. మంథని  ఎమ్మెల్యే  శ్రీధర్ బాబు ను కాదని  వెళ్లి తప్పు చేశానని నా తప్పు తెలుసుకొని మళ్లీ వెంటనే సొంత గూటికి చేరుకున్నానని నరేష్ అన్నారు. సర్పంచ్ నరేష్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.