పెద్దపెల్లి జిల్లాలో మైనింగ్ అధికారుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా... 

పెద్దపెల్లి జిల్లాలో మైనింగ్ అధికారుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా... 
  • నెల నెల అధికారులకు ముడుతున్న ముడుపులు 
  • జిల్లాలో రాత్రి లేదు పగలు లేదు ముత్తారం. కాల్వశ్రీరాంపూర్. సుల్తానాబాద్ తదితర మండలలో ట్రాక్టర్లతో జోరుగా ఇసుక తరలింపు
  • పట్టించుకోని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి: కంచే చేనుమేసినట్లు ఉంది పెద్దపల్లి మైనింగ్ శాఖ అధికారుల వ్యవహారం. జిల్లాలోని మానేరు నదిలో నుంచి ఇసుక తరలించుకుపోకుండా కాపలా ఉండాల్సిన మైనింగ్, రెవెన్యూ  అధికారులు మామూళ్లు తీసుకొని దగ్గరుండి మానేరు నదిలో నుండి ఇసుక ట్రాక్టర్లు తరలిస్తున్న ఘటనలు పెద్దపెల్లి జిల్లాలో కొనసాగుతున్నాయి.  పెద్దపెల్లి జిల్లా మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్,ఓదెలు తదితర మండలంలోని మండల కేంద్రంతో పాటు మండలంలోని తదితర గ్రామాల్లో నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా జోరుగా ఇసుక అక్రమంగా తరలిపోతుంది,  అయితే నెల నెల మామూలు ఇస్తలేరని మైనింగ్ , ఎస్ఆర్ఓ ఒక ట్రాక్టర్ ఓనర్ లకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.  ఒక్కో ట్రాక్టర్ కు నెలకు రూ. 3 వేల నుంచి రూ. 5000 వేల వరకు మైనింగ్  ఎస్ఆర్ఓల కు ముట్ట చెబుతూ ట్రాక్టర్ ఓనర్లు దర్జాగా రాత్రి పగలు అనే తేడా లేకుండా మానేరు నుండి మండల కేంద్రంలో నుంచి  ఇసుక ను సింగరేణి ప్రభావిత గ్రామాలైన రామగిరి మండలం రత్నాపూర్ పన్నూరు, బేగంపేట్ తదితర గ్రామాలకు తరలిస్తున్నారు.  మానేరు నది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులే మాముల్లకు అలవాటు పడి అక్రమంగా టాక్టర్లలో ఇసుక ను తరలిస్తుంటే ఆయా గ్రామాల ప్రజలు అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సాండ్ టాక్స్ కు  మంగళం పాడిన మైనింగ్ అధికారులు ఒక్కో ట్రాక్టర్ కు రూ. 25 వేల డిపాజిట్ చేయించుకున్న మైనింగ్ శాఖ ఇసుక అక్రమంగా నడవడంతో ట్రిప్పులు లేక తీవ్రంగా నష్టపోతున్న సాండ్ టాక్స్ ట్రాక్టర్ ఓనర్లు. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మానేరు నుంచి పేద ప్రజలకు ఇసుక తక్కువ ధరకే అందించేందుకు సాండ్ టాక్స్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి ఒక్క ట్రాక్టర్ ఓనర్ మైనింగ్ శాఖకు రూ. 25000 వేల రూపాయలు ఒక్కో ట్రాక్టర్ కు డిపాజిట్ చేయాలి ఆ తరువాత సామాన్య ప్రజలు ఇసుక కోసం మీ సేవలో ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే మైనింగ్ శాఖ డిపాజిట్ చేసిన ట్రాక్టర్ ఓనర్లకు మెసేజ్ లు పంపిస్తారు. మానేరు వద్ద ఎస్ఆర్ఓ లు ఉండి ట్రాక్టర్లను వరుస సంఖ్యలో పంపియ్యాలి, అప్పుడు ఇల్లు నిర్మించుకుంటున్న ఇటు పేద ప్రజలకు ట్రాక్టర్ ఓనర్లకు లాభం చేకూరేది. కానీ ఏకంగా మైనింగ్ శాఖ ఎస్ఆర్ఓ లే లంచాలకు అలవాటు పడి ఖమ్మంపల్లి, మండల కేంద్రం ముత్తారం లో ట్రాక్టర్ ఓనర్ల వద్ద నెల నెల  మామూళ్లు తీసుకొని రాత్రివేళలో ట్రాక్టర్లను నడిపిస్తుండడంతో పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.  ఎలా అంటే సాండ్ టాక్స్ బుక్ చేసుకుంటే ఖమ్మంపల్లి మానేరు నుంచి రామగిరి మండలం బేగంపేట వరకు రూ 2500 వరకు ఉంటుంది. అదే రాత్రి వేళలో అక్రమంగా ఇసుక తరలిస్తే రూ. 4000 వేల పైనే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.  దీంతో ప్రజలు సాండ్ టాక్స్ బుక్ చేసుకోకుండా అర్జెంట్ అవసరం ఉందని రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో తరలించుకుంటున్నారు.  దీంతో రూ. 25000 వేలు డిపాజిట్ చేసిన ట్రాక్టర్ ఓనర్లు తక్కువ ధరకు ఇసుక అందించే ఇంటి యాజమానుల పేదలకు తీవ్ర నష్టం జరుగుతుంది.  ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్ సార్ మీరైనా న్యాయం చేయండి అంటున్నారు. సాండ్ టాక్స్ కోసం డిపాజిట్ చేసిన ట్రాక్టర్ ఓనర్లు. దు అదుపు లేకుండా రాత్రి పగలు మానేరు నుంచి ఇసకను అక్రమంగా తరలించకపోతుంటే మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ లు  పట్టించుకోకపోడంతో ఈ అక్రమ దందాను అరికట్టేదవరని  ప్రజలు జిల్లా  కలెక్టర్ ను ప్రశ్నిస్తున్నారు.