మంథని లో హత్యలకు...అరాచకాలకు కేరాఫ్ అడ్రాస్ పుట్ట...రౌడీయిజం

మంథని లో హత్యలకు...అరాచకాలకు కేరాఫ్ అడ్రాస్ పుట్ట...రౌడీయిజం
  • మాఫీయాలకు అడ్డ...పుట్ట మధుకర్ గడ్డ లాగా మంథని నియోజక వర్గాన్ని మార్చి హత్యా రాజకీయాలు చేసే  పుట్ట మధుకు గన్ మెన్ లు అవసరమా
  • మంథనిలో ప్రెస్ క్లబ్ లో డిసిసి అధికార ప్రతినిధి,  మీడియా కన్వీనర్ ఇనుముల సతీష్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని నియోజకవర్గంలో హత్యలకు...అరాచకాలకు కేరాఫ్ అడ్రాస్ పుట్ట...రౌడీయిజమేనని, మంథనిలో హత్య రాజకీయాలు గుండాగిరి దౌర్జన్యం చేస్తూ ప్రజలను ప్రతిపక్ష నాయకులను  భయభ్రాంతులకు గురిచేసిన జెడ్పి చైర్మన్ పుట్ట మధు కు గన్ మెన్ లు ఎందుకని డిసిసి అధికార ప్రతినిధి మంథని డివిజన్ మీడియా కన్వీనర్ ఇనుముల సతీష్ అన్నారు. శనివారం మంథని ప్రెస్ క్లబ్ లో మంథని ఎంపీపీ కొండా శంకర్, మంథని మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంవత్సరాల నుండి మంథని నియోజకవర్గం లో హత్య రాజకీయాలు చేస్తూ, గుండాగిరి చేస్తూ కోట్లల్లో ఆస్తులు కూడబెట్టుకొని అక్రమంగా భూములు సేకరించి  అడ్డు వచ్చిన వారిని హతమారుస్తూ కుట్ర హత్య రాజకీయాలు చేసిన పుట్ట మధుకు నేడు ప్రాణ భయం రావడం  శోచనీయమని, మంథని నియోజక వర్గంలో ఎంతో మంది ఎస్సీ బీసీలను హత్యలు చేయించిన చరిత్ర పుట్ట మధుకుందన్నారు.

పట్టపగలు న్యాయవాద దంపతులను చంపించింది ఎవరని ఆయన ప్రశ్నించారు. న్యాయ దంపతుల హత్యలలో జైలుకు వెళ్ళింది పుట్ట మధు మేనల్లుడు కాదా... జడ్పీ చైర్మన్ హస్తం లేదా... అని ప్రశ్నించారు. నమ్మిన వారిని మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యలాగా వ్యవహరిస్తూన్నాడని అన్నారు. నమ్మిన వారిని వెన్నుపోటు పొడిచే విద్య బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అతనిపైననే అది ప్రయోగిస్తున్నారని ఆన్నారు.  హత్య రాజకీయాలు చేసే పుట్ట మధు కు గన్ మెన్లు ఉండాల్సిన అవసరం ఏముందన్నారు. విశ్వాసం కోల్పోయిన జడ్పీ చైర్మన్ పైన అవిశ్వాసం పెడితే తప్పేంటి అన్నారు. ఆనాడు తమ నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వెన్నుపోటు పొడిచిన విషయం గుర్తులేదా అన్నారు. మంథని లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పుట్ట మధు మాట్లాడినవన్నీ అబద్ధాలేనని వాటిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ పైన విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరి మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు.  నియోజకవర్గం లో గత రాక్షస పాలన అంతమైందని ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజల సంతోషాన్ని చూసి భరించలేక పుట్ట మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్. గత నెల 15న నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలన లో ఎలాంటి హత్యలు జరగలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంథని ప్రాంతంలో అనేక దళితులు, బీసీలు, బ్రాహ్మణులు  ఎంతోమంది హత్యలకు గురయ్యారని, అక్రమ కేసులు బనాయించారని, ఈ హత్యల వెనుక పుట్ట మధున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసని సతీష్  పేర్కొన్నారు.

మంథని ఎంపీపీ కొండా శంకర్ మాట్లాడుతూ 

తమ నాయకుడు శ్రీధర్ బాబు 100 కోట్లు ఖర్చుపెట్టి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాడని పుట్ట మధు నిన్నటి  సభలో అనడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరో ప్రజలందరికీ తెలుసని ఎవరి వద్ద వందల కోట్లు ఉన్నాయో కూడా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. పార్టీ మారిన ప్రజా ప్రతినిధులు డబ్బులకు అమ్ముడుపోయారని చెప్పటం జడ్పీ చైర్మన్ అవివేకానికి నిదర్శనమన్నారు. తమ నాయకుడు శ్రీధర్ బాబు చదువుకున్న వ్యక్తి అని, ఉన్నత విలువలతో కూడిన వ్యక్తి అన్నారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు పైన విశ్వాసం కోల్పోయిన తమలాంటి ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని వీడి శ్రీధర్ బాబు   సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు.

జడ్పీ చైర్మన్ సతీమణి పుట్ట శైలజ మున్సిపల్ చైర్మన్ గా ఉండి కూడా కౌన్సిలర్ల విశ్వాసాన్ని చూడడం లేదని అందుచేత మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి అవిశ్వాసం పెట్టారన్నారు. ఇప్పటికైనా జడ్పీ చైర్మన్ తన పద్ధతి మార్చుకొని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోసారి తమ నాయకుని పైన తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీపతి బానయ్య, వి కే రవి, చొప్పకట్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.