ప్రశాంతమైన వాతావరణం లో పోలింగ్ నిర్వహణ..

ప్రశాంతమైన వాతావరణం లో పోలింగ్ నిర్వహణ..

 రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల సందర్శించిన లో రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ప్రశాంతమైన వాతావరణం లో పోలింగ్ నిర్వహించామని రామగుండం పోలీస్ కమీషనర్ రెమారాజేశ్వరి అన్నారు. గురువారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లా మంథని లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెద్దపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, గోదావరిఖని లోని సీక్రెడ్ హార్ట్ హై స్కూల్ లలో, అదేవిదంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి, విధి నిర్వహణలో పోలీస్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తరువాత పోలింగ్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాలకు తరలింపు గురించి పలు ఆదేశాలు సూచనలు చేశారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని, ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఎలాంటి అవాంఛనియా సంఘటనలు, గోడవలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు అందరు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ పోలీస్ వారికీ సహకరించారని. ప్రజలు అందరు వచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలని, పోలీస్ సిబ్బంది వారికి భద్రత కల్పిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టమని ఆమె తెలిపారు. సిపి వెంట మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపిఎస్., గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, మంథని సీఐ సతీష్, పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్ఐ లు పాల్గొన్నారు.