స్వతంత్ర అభ్యర్థిగానే రామగుండం ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

స్వతంత్ర అభ్యర్థిగానే రామగుండం ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

గత మూడు రోజులుగా కొనసాగుతున్న సస్పెండ్ తెరదించిన సోమారపు సత్యనారాయణ

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: గత మూడు రోజులుగా రామగుండం నియోజకవర్గంలో సోమారం సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కు రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. గోదావరిఖని లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం నియోజక వర్గం నుండిముమ్మాటికి ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ గుర్తు వస్తుందో అదే గుర్తుపై పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. రామగుండం నియోజక వర్గంలో చాలా మంది నా సహకారం కోరుకుంటున్నారని అన్నారు. ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసిన ప్రజలు చేసిన పనులను మర్చిపోరని తెలిపారు. రామగుండంలో నేను గెలిచే అవకాశం ఉందన్నారు. విద్యావంతుడిగా, అనుభవం ఉన్న నాయకుడిగా సమర్ధవంతమైన నిజాయితీ పాలనను అందిస్తానని పేర్కొన్నారు. ఏ పార్టీ గెలిచిన ఎలా పని చేయించుకోవాలో నాకు తెలుసని అన్నారు. నియోజక వర్గంలో సోమరపు సత్యనారాయణ కంటూ ఒక ప్రత్యేకత ఉందని, నా నిజాయితీనే నన్ను గెలిపిస్తుందని ధీమా  వ్యక్తం చేశారు.