ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తెలంగాణ రైతులు అండగా ఉంటారు

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తెలంగాణ రైతులు అండగా ఉంటారు
  • బిజెపి ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుంది...
  • కోలనూర్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రాస్తారోకో లో పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ గుండేటి ఐలయ్య యాదవ్


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తెలంగాణ రైతులు అండగా ఉంటారని, బిజెపి ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుందని కోలనూర్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రాస్తారోకో లో పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ గుండేటి ఐలయ్య యాదవ్ అన్నారు. ఓదెల మండలం కొలనూర్ రైల్వే గేటు వద్ద ఎడ్ల బండిని రోడ్డు మీద పెట్టి ఆర్టీసీ బస్ లను నిలిపి వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్, పీఏసీఎస్ మాజి చైర్మెన్ గోపు నారాయణరెడ్డి మాట్లాడుతూ  గత మూడు రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ రైతు సంఘాల ఆధ్వర్యంలో స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలేక రైతు అన్నలు పురుగుల మందే పెరుగన్నామవుతుందని, రైతు పంటేస్తే అప్పులే మిగిలుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎక్కడ అన్యాయం జరుగకుండా రైతు కండ్లలో ఆనందం నింప్పే విదంగా పని చేరిందని, కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడున్న బిజిపి కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా రైతులు వినియోగించే ఎరువులకు భారీగా రేట్లు పెంచి రైతులు గిట్టుబాటు ధర లేకుండా నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని రాహుల్ గాంధీ  ని సైతం మూడు రోజుల నుండి హర్యానా, పంజాబ్ రైతులు ఢిల్లీకి చెరుకోకుండా రోడ్లను తవ్వి ఇనుప కంచెలు పెట్టి అడ్డుకున్నారని, ఢిల్లీకి చేరుకున్న రైతులందరిని అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు బనాయించారని, ఆ కేసులను వెంటనే ఎత్తివేయని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని అన్నారు.రైతులు మనో దైర్యంగా ఉండాలని కేంద్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమన్నారు. రైతులకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పినందుకు రాహుల్ గాంధీకి  రైతుల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తెలంగాణ రైతులు రైతులం అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కసరపు ఐలయ్య,  మాజీ సర్పంచ్ మరవేని రామస్వామి, బొంగని రాజయ్య గౌడ్, నాయకులు కె శ్రీనివాస్, జంగ మహేష్, శ్రీకాంత్ ఐలయ్య, పున్నారెడ్డి , లింగయ్య, రాములు, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీంద్రారెడ్డి, శ్రీకాంత్ , అరవింద్, కిట్టస్వామి తదితరులు పాల్గొన్నారు.