తెలంగాణ ప్రభుత్వంలో పేదవారికి సంక్షేమ ఫలాలు అందడం లేదు - ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణ ప్రభుత్వంలో పేదవారికి సంక్షేమ ఫలాలు అందడం లేదు - ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు పేదవారికి అందడం లేదని  మాజీ మంత్రి,  మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.  గురువారం ముత్తారం మండలంలోని  కేశనపల్లి,  మచ్చుపేట, హరిపురం తదితర గ్రామాలకు చెందిన 100 మంది బీఆర్ఎస్ యువకులు,  కార్యకర్తలు శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి శ్రీధర్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదవారికి అందడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ స్కీములను పేదవారికి అందించి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, మచ్చపేట మాజీ సర్పంచ్ గోవింద పద్మ ఆనంద్, యూత్ మండల అధ్యక్షుడు బిరియాని శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

ముత్తారం,కేశనపల్లి,హరిపురం, మచ్చుపేట,గ్రామాల నుండి యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ముత్తారం మండల కేంద్రంలోని ముత్తారం గ్రామానికి చెందిన BRS పార్టీ యూత్ సబ్యులకు ఏఐసీసీ సెక్రటరీ,మాజీ మంత్రివర్యులు,తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో చైర్మన్, మంథని శాసనసబ్యులు శ్రీ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు గారు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల ప్రజా ప్రతినిధులు పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.