సీతంపేటలో క్షుద్ర పూజలు భయాందోళనలో గ్రామస్తులు
ముత్తారం ముద్ర: మండలంలోని సీతంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో శుక్రవారం రాత్రి పదిమంది వ్యక్తులు సీతంపేట శుక్రవారం పల్లి ఇప్పలపల్లి గ్రామాలలో ప్రధాన చౌరస్తాల మధ్య శుద్ధ పూజలు నిర్వహించారు.
ఈ శుద్ర పూజలలో నిమ్మకాయలు, కొబ్బరికాయలు, బోల్ పేలాలు, పసుపు, కుంకుమ, బూడిది గుమ్మడికాయల తో పాటు మంత్రించిన నిమ్మకాయలను పెట్టి అగర్బత్తిలను కాల్చి క్షుద్ర పూజలు చేశారని గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామం చుట్టూ క్షుద్ర పూజలు ఎందుకు చేశారు, ఎవరు చేశారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ శుద్ర పూజలు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.