మాజీ సిఎం కెసిఆర్ బస్సును  తనిఖీ చేసిన పోలీస్లు

మాజీ సిఎం కెసిఆర్ బస్సును  తనిఖీ చేసిన పోలీస్లు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలకు బస్సు యాత్రగా వచ్చిన బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వాహనాన్ని ఎన్నికల తనిఖీ అధికారుల బృందం తనిఖీ నిర్వహించింది. బస్సు యాత్రలో భాగంగా జగిత్యాల నుంచి నిజాంబాద్ వైపు వెళుతున్న కేసీఆర్ కాన్వాయ్ వాహనాన్ని జగిత్యాల మండలం చలిగల్ వద్ద అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ వాహన నిర్వాహకులు అధికారులకు పూర్తిగా సహకరించారు.