కొండగట్టులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు... 

కొండగట్టులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు... 

స్వామివారికి లక్ష తమలపాకులతో అలంకరణ.. పూర్ణహుతి...
ముద్ర, మల్యాల: తెలంగాణలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో గల కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం పెద్ద జయంతి వేడుకలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెల్లవారుజామున స్వామివారి మూలవిరాట్ ను లక్ష తమలపాకులు, పూలతో అలంకరించారు. అనంతరం యాగశాలలో 9 గంటల నుంచి నిర్వహిస్తున్న వివిధ పుజా కార్యక్రమాల్లో భాగంగా పూర్ణహుతి, ఉయ్యాలసేవా, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ రోజు రాత్రి వరకు పూజలు కొనసాగుతాయని స్థానాచార్యులు కపీoదర్ తెలిపారు.
 అష్ట కష్టాలు పడ్డ భక్తులు..

ఈవో నిలదీత... కొండగట్టు ఆలయ అధికారులు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి... దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వీరoదరూ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన వారు మాత్రం భక్తులకు కష్టాలు చూపిస్తున్నారు. ఆదివారం ఉదయం క్యూలైన్ లో దాదాపు మూడు గంటల సేపు దర్శనంకు నిరీక్షించిన భక్తులు త్రాగునీరు లేక, ఉకకపోతతో కొండపై అష్ట కష్టాలు పడ్డారు. స్వామి మాల ధరించిన పలువురు చిన్నారులు, మహిళలు క్యూలైన్ లో సోమ్మసిల్లి పడిపోయారు.

ఓ బాలుడిని క్యూలైన్ నుంచి బయటకు తీసుకోచ్చి పోలీసులు, వైద్య సిబ్బంది గ్లూకోజ్ వాటర్ అందజేశారు. కాగా, భక్తులు ఈవో వెంకటేష్ ను నిలదీశారు. ఇది ఇలాంటి ఉండగా, కోనేరు లో పూర్తిగా మురికిగా మారిన నీటిలో స్నానము చేసేందుకు భక్తులు ఇష్టపడలేదు. శానిటేషన్ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసిన చెత్త పేరుకుపోయింది.