10 లక్షలతో సీసీ రోడ్డు పనులు

10 లక్షలతో సీసీ రోడ్డు పనులు

ముద్ర, మల్యాల: మల్యాల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 10 వ వార్డు ఎస్సీ కాలనీలో బుధవారం సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. దాదాపు 10 లక్షల నిధులు సీసీ రోడ్డుకు వెచ్చించినట్లు సర్పంచ్ సుదర్శన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షులు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ రాచర్ల రమేష్, వార్డ్ సభ్యులు శానిగారపు తిరుపతి, బొల్లారపు నరేష్, నాయకులు మల్యాల గణేష్, అలంకార్, చందు, స్థానికులు, పంచాయతి సిబ్బంది, పాల్గొన్నారు.