బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

ముద్ర, మల్యాల: ఇటీవల వడదెబ్బ కారణంగా మృతి చెందిన మల్యాలలోని బీసీ కాలనీకి చెందిన ఐతరవేణి రమేష్ కుటుంబానికి బుధవారం పలువురు ఆర్థిక సహాయం చేశారు. మల్యాల ఉపసర్పంచ్ పోతరాజు శ్రీనివాస్ 2 వేలు, రాగుట్ల బుమేష్ 5 వేలు, కొంకటి సతీష్ వేయి రూపాయలు అందజేసినట్లు బీఆర్ఎస్ నాయకులు మల్యాల గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల సంతోష్, గడుగు గంగాధర్, సోన్నాకుల శ్రీనివాస్, వంగళ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.