కొండగట్టులో ఏఈవో చర్చ ఏంటి..?

కొండగట్టులో ఏఈవో చర్చ ఏంటి..?
  • పలు ఆరోపణల దృష్ట్యా.. బదిలీపై వెళ్లి, కొండగట్టు వచ్చిన ఏఈవో..!
  • సర్వత్రా వెలువెత్తుతున్న విమర్శలు...

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రస్తుతం ఏఈవో బుద్ది శ్రీనివాస్ చర్చ ఫుల్ గా జరుగుతుంది. ఇటీవల పలు ఆరోపణల దృష్ట్యా బదిలీపై వెళ్లిన ఏఈవో, 6 నెలలు తిరక్కముందే మళ్ళీ కొండగట్టు రావడం సర్వాత్రా చర్చనీయంశమైంది. అయితే ఏఈవో బుద్ది శ్రీనివాస్ ఎలా వచ్చారు.. ఎవరూ రప్పించారు.. అనే దానిపై వివిధ రకాలుగా చర్చ జరుగుతోంది.. కొందరు స్థానిక ఎమ్మెల్యే వల్లనే బుద్ది శ్రీనివాస్ కొండగట్టు వచ్చారని, మరికొందరు అధికార పార్టీ మాజీ ఎంపీ ప్రత్యేకoగా కమిషనర్ కి చెప్పడంతోని వచ్చారని బహిరంగానే చర్చించుకుంటున్నారు. అయితే బుద్ది శ్రీనివాస్ రాకను పలువురు తప్పు పడుతున్నారు. ఆరోపణలతో పాటు, కొన్ని ఏండ్లుగా తిష్ట వేసి ఉన్న ఆయన బదిలీపై వెళ్ళినప్పటికి, మళ్ళీ రప్పించడం ఏంటని, ఇది ఎవరికీ లాభమని చర్చ జరుగుతోంది.

రెండు నెలల కోసమే..
ఇది ఇలా ఉండగా, చిన్న, పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో రెండు నెలలకు గాను, కొండగట్టులో పని చేసి, బదిలీపై వెళ్లిన పలువురు అధికారులను పంపించవలసిందిగా ఈవో  వెంకటేష్ దేవాదాయశాఖ కమిషనర్కు లేఖ రాసినట్లు సమాచారం. దాంట్లో భాగంగానే బుద్ది శ్రీనివాస్ వచ్చినట్లు వాస్తవం అయినప్పటికీ, ఏఈవో మాటల్లో తాను పర్మనెంట్ గానే వచ్చినట్టు చెప్పుకోవడంతో చర్చనీయంశమైంది. కాగా, 1999లో కొండగట్టు ఆలయానికి వచ్చిన బుద్ది శ్రీనివాస్ మధ్యలో వేరే చోటుకు బదిలీపై వెళ్లి, మళ్ళీ కొండగట్టు వచ్చారు. అప్పటి నుంచి కొండగట్టులోనే విధులు నిర్వహిస్తూ, ఇక్కడే ఏఈవో వరకు పదోన్నతి పొందారు. కొండగట్టులో తనదైన శైలిలో నడిపించిన బుద్ది శ్రీనివాస్ ఇటీవల, విజిలెన్స్ నివేదిక నేపథ్యంలో ఇక్కడి నుంచి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కి బదిలీపై వెళ్లారు. ఏఈవో తో పాటు, మరో ఇద్దరు ఉద్యోగులు కూడా ఇందులో భాగంగానే బదిలీపై వెళ్లారు. జీ వో నంబర్ 888 ప్రకారం ఉద్యోగులు వారు ఎక్కడ పోస్టింగ్ తీసుకుంటే అక్కడే అన్ని విధాల లబ్ది పొందాలనేది దేవాదాయ శాఖలో ఉన్నప్పటికీ, బుద్ది శ్రీనివాస్ విషయంలో అవి తుంగలో తొక్కారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ స్పందించి కొండగట్టులో ఏండ్ల తరబడి పని చేస్తున్న ఉద్యోగులను పంపించి, కొత్త వారిని నియమించడంతో పాటు, పెద్ద దేవస్థానం అయినందునా.. ఐఏఎస్ స్థాయి అధికారిని కార్యనిర్వాహణాధికారిగా నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.