ఘనంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు  సామూహిక నవగ్రహ పూజలు చేసిన భక్తులు.

ఘనంగా వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు  సామూహిక నవగ్రహ పూజలు చేసిన భక్తులు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  జగిత్యాల జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి లోని అతిపురతనమైన ఆలయంగా వెలుగొందుతున్న శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో బాగంగా  శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి  ఆదేశానుసారంగా శ్రీ రాధ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాలస్వామి వారి పంచాహ్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు  ప్రముఖ జ్యోతి, వాస్తు శాస్త్ర పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక ఆధ్వర్యంలో మంగళ వారం ప్రారంభమయ్యాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయంలో ప్రతియేటా స్వస్తిశ్రీ శ్రీశోభకృతునామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి సోమవారం మొదలు వైశాఖ బహుళపాండ్యమి శనివారం వరకు ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో బాగంగా  భేరితాడనము, దేవతాహ్వానము, నవగ్రహ హోమారంభము,  సాయంత్రం ధ్వజారోహణము,  గోధూళికా  సుముహూర్తమున స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో  విద్యుత్ కాంతులు, చలువ పందిర్లుతో ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో అలంకరించి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయం నిర్వాహకులు, వేద పండితులు, విశేష సంఖ్యలో భక్తులు, మహిళలు, పాల్గొన్నారు.