తడిచిన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలి.. --డాక్టర్ గోలి మోహన్

తడిచిన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలి..  --డాక్టర్ గోలి మోహన్

ముద్ర, రుద్రంగి :పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేములవాడ నియోజకవర్గం నాయకులు డాక్టర్ గోలి మోహన్ అన్నారు. మంగళవారం రోజున  రాజన్న  సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోళీమోహన్ మాట్లాడుతూ వడగళ్ల వానతో రైతులు తీవ్ర నష్టపోయారని వారిని  ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి గనుక వారిని ఆదుకొని రైతులకు భరోసా కల్పించాలని కోరారు.వడగల్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలని అన్నారు.తడిచిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయించి తరలించే విధంగా అధికారులను ఆదేశించి కళ్ళల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించాలని మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ ను కు విజ్ఞప్తి చేశారు...