పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలలో భాగంగా పట్టణం లోని 19 వ వార్డుకి అవార్డులు

పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలలో భాగంగా పట్టణం లోని 19 వ వార్డుకి అవార్డులు

ముద్ర సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల పట్టణం లో పారిశ్యుద్ద నిర్వహణ లో భాగంగా ఉత్తమ వార్డ్ విభాగం లో 19 వ వార్డుకి అవార్డు దక్కింది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చేతుల మీదుగా ఈ అవార్డు ని కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ కి అందచేశారు. డోర్ టూ డోర్ చెత్త సేకరణ , తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం, ఎప్పటికపుడు వార్డ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వలనే ఈ అవార్డు తమ వార్డ్ కి వచ్చిందని అన్నారం శ్రీనివాస్ అన్నారు. అలాగే మహిళా పారిశ్రామికవేత్త విభాగం లో భాగంగా 19 వ వార్డుకి చెందిన 'సిరిశాల విస్తరాకు తయారీ కేంద్రం' నిర్వహిస్తున్న వార్డ్ మహిళా సంఘానికి అవార్డు ప్రదానం చేశారు.