సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఇషా జైస్వాల్ అరెస్ట్

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఇషా జైస్వాల్ అరెస్ట్

Patna:కామర్స్ గ్రాడ్యుయేట్, సోషల్ మీడియా ఇన్ ఫ్లయెన్సర్ ఇషా జైస్వాల్ ను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. అరో తరగతి ఫెయిలైన ఒక సైబర్ నేరగాడు ముస్తాక్ ఆలం కోసం ఆమె తన భర్త, బిడ్డను వదిలేసింది. వీరిద్దరినీ 5 కోట్ల రూపాయల మోసం కేసులో బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులిద్దరూ ప్రతి మోసానికి 10 శాతం కమీషన్ పొందుతున్నారని పోలీసులు తెలిపారు. వీరికి పాకిస్తాన్ తో కూడా సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.