చెరువులో వేటకు వెళ్లి ఇద్దరు మృతి 

చెరువులో వేటకు వెళ్లి ఇద్దరు మృతి 

తూప్రాన్, ముద్ర: చెరువులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన ఎండీ యాసిన్ ఖాన్ (60), యాదయ్య (60)లు మంగళవారం సాయంత్రం  చెరువులో చేపల వేటకు వెళ్లారు.  చీకటి పడే సమయంలో చెరువులో దిగి వల తీస్తుండగా వల తెగిపోవడంతో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నీట మునిగారు. గ్రామస్థులు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.