అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు హన్మగారి దాసు అనారోగ్యంతో మరణించగా ఆదివారం అంత్యక్రియల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. దాస్ కుటుంబసభ్యులను ఓదార్చి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణ సహాయంగా 10 వేల రూపాయలు అందజేశారు. హన్మగారి దాస్ కుటుంబాన్ని పార్టీ తరుపున, ప్రభుత్వం తరుపున అన్నివిధాలుగా ఆదుకుంటానని తెలిపారు. వెంట జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, స్థానిక నాయకులు ప్రభాకర్, రవి, కిష్టయ్య, సిద్ధిరాములు తదితరులు ఉన్నారు.