వేగం కుటుంబాన్ని మింగింది

వేగం కుటుంబాన్ని మింగింది
  • లారీని ఢీకొన్న కారు
  • చిన్నారి సహా ఆరుగురి దుర్మరణం

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా ళ్తున్న ఓ కారు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కుటుంబం విజయవాడ నుంచి రాజమండ్రికి కారులో బయలుదేరింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటని స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.