అప్పుడు మల్లన్న.. ఇప్పుడు శీనన్న బీఆర్ఎస్​ అమాత్యులకు అభిషేకాలు

అప్పుడు మల్లన్న.. ఇప్పుడు శీనన్న బీఆర్ఎస్​ అమాత్యులకు అభిషేకాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : చిట్రపటాలకు పాలాభిషేకం చేయడం సాధారణ విషయమే. కానీ, రాష్ట్రంలో అమాత్యులను కుర్చీలో కూర్చుండబెట్టి నేరుగా పాలు పోసి అభిషేకాలు చేస్తున్నారు. గతంలో మంత్రి మల్లారెడ్డి ఇదే వివాదం ఎదుర్కొగా, ఇప్పుడు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ కూడా అదే విమర్శలను ఎదుర్కొంటున్నారు. మహబూబ్​నగర్​ లోని బీకేరెడ్డి కాలనీలో కాలనీవాసులు మంత్రికి పాలు, పుష్పాలతో అభిషేకాలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నాడని, పేదల సమస్యలను పరిష్కరిస్తున్నారంటూ నేరుగా అభిషేకం చేశారు. గతంలో మంత్రి మల్లారెడ్డి కూడా ఇలాగే పుట్టిన రోజు సందర్భంగా మల్లారెడ్డి పాలాభిషేకం చేయించుకున్నారు. ఆయనపై పాలు పోసిన అభిమానులు ప్రేమను చాటారు. పట్టుపంచె, కండువా కప్పుకొని కూర్చీ మీద కూర్చున్న మల్లారెడ్డికి బకెట్‌ నిండా పాలు తెచ్చి.. చెంబులతో పాలాభిషేకం చేస్తూ ఆయనను పాలమయం చేశారు. అనంతరం పూజారి ఆయనపై అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు వైరల్ గా మారాయి.