తెలుగోళ్లకు దక్కని రాజ్యసభ

తెలుగోళ్లకు దక్కని రాజ్యసభ
  • మురళీధర్​రావు, విజయశాంతి, గరికపాటి, వివేక్​కు బీజేపీ మొండిచెయ్యి
  • జూలై 24న ఎన్నికలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ అధిష్ఠానం బుధవారం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో తెలుగువారికి అవకాశం దక్కలేదు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్​రావు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామికి రాజ్యసభ సీటు దక్కలేదు. గరికపాటిని రెన్యూవల్ చేస్తామని కొంత కాలంగా బీజేపీ చెప్పింది. కానీ ఆయనకు సీటు దక్కలేదు. విజయశాంతి, మురళీదర్​రావును తప్పకుండా రాజ్యసభ ఇస్తామని ప్రకటించారు. కానీ ఇవ్వలేదు. వివేక్​కు రాజ్యసభ లేదా ఎస్సీ కమిషన్ చైర్మన్​ ఇస్తామని ఆశ చూపారు. చానీ అవి రెండూ దక్కలేదు. కేవలం గుజరాత్ నుంచి బాబుబాయి జేసంగ్ బాయ్, కె. శ్రీదేవన్స్ జాలా, బెంగాల్ నుంచి అనంత మహరాజ్ కు స్థానం కల్పించారు. జూలై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో అధికంగా పశ్చిమ బెంగాల్ లో 6 స్థానాలు, గుజరాత్ లో 3, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.