నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్: బాలినేని
తనకు వైఎస్ఆర్ రాజకీయ భిక్ష పెట్టారన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి తాను కీలక నేతగా వ్యవహరించానన్నారు. గోనె ప్రకాశ్‌కు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు. కావాలనే మాట్లాడినట్లు కనిపిస్తోందన్నారు. నాపై ఎమ్యెల్యేలతో సీఎంకు ఫిర్యాదు చేయిస్తున్నారు. పార్టీ కోసం నేను చాలా శ్రమించా, ఎన్నో బాధలు పడ్డాను అన్నారు. కానీ నాపై నిందలు, ఆరోపణలు భరించలేకపోతున్నా అన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.