సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేఘనాథ్ గౌడ్ 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేఘనాథ్ గౌడ్ 
  •  పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కోరిన సీఎం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు మేఘనాథ్ గౌడ్(సంఘం కలాన్ మాజీ సర్పంచ్) బుధవారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేఘనాథ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి పూల బొకే ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తాండూర్ ప్రాంతంలో చేవెళ్ల పార్లమెంటు స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి భారీ మెజార్టీ సాధించి పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  కలిసికట్టుగా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు మండలంలో తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మేఘనాథ్ గౌడ్ తెలిపారు.