బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన పలువురు నాయకులు కార్యకర్తలు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన పలువురు నాయకులు కార్యకర్తలు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ మండలం  పులుసు మామిడి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వికారాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిఎసిఎస్ డైరెక్టర్ కే. జనార్ధన్, దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు  జగదీశ్వర్, సీనియర్ నాయకులు పాండురంగారెడ్డి, వడ్ల రవి, సుభాన్ రెడ్డి, వడ్ల ఆనందం ,అంబారెడ్డి, మల్లయ్య, చారి, సుభాష్, భోజిరెడ్డి,  గౌస్, గోవర్ధన్ రెడ్డి, కుమారస్వామి, మహేందర్ రెడ్డి, నర్సింలు, నవీన్, సురేందర్, రఫీయోద్దీన్, వారి అనుచరులు  52 మంది  కార్యకర్తలు మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్  సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ప్రసాద్ కుమార్   కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాగా మాజీ మంత్రి  గడ్డం ప్రసాద్ కుమార్  పై అభిమానంతో మన్మోహన్ గౌడ్ ,సుభాష్ గౌడ్, మల్లన్న, రాజు ,నరేందర్ గౌడ్ లు పాడిన  ఆడియో పాటను స్వయంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.