Dial your Chair Person: ఛైర్మెన్ మంజుల కు ప్రజల నుండి ప్రశంసలు

Dial your Chair Person: ఛైర్మెన్ మంజుల కు ప్రజల నుండి ప్రశంసలు
Vikarabad Municipal Chair Person Chairman Manjula

ముద్ర ప్రతినిధి వికారాబాద్: ఒకప్పుడు తమ వార్డులో, తమ సొంత సమస్యలు ఏమి ఉన్న ఎవరికీ చెప్పాలో తెలియక సతమతమై సమస్యలతో కాలం గడిపిన మాకు డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమం ఊరట కలిగిందని వికారాబాద్ పట్టణ ప్రజలు ఫోన్ చేసి మరి ప్రశంసించడం ఆనందంగా ఉందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు.

డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను వారం నుండి పది రోజుల వ్యవధిలోనే పరిష్కరించడంతో ఈ కార్యక్రమానికి రోజురోజుకు భారీగా ప్రజాదరణ పెరుగుతుంది. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి 17 ఫిర్యాదులు అందాయని, ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చైర్ పర్సన్ మంజుల రమేష్  తెలిపారు.