జమాతే ఇస్లామి హింద్ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే

జమాతే ఇస్లామి హింద్ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి కే స్థానిక జమాతే ఇస్లామి హింద్ సంస్థ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జమాత్ ఇస్లామీ హింద్ ప్రతినిధులు తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డికి సన్మానం కూడా నిర్వహించారు. తాండూర్ నియోజకవర్గంలో నెలకొన్న స్థానిక సమస్యలతో పాటు ఉర్దూ మీడియం పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బు య్యని మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలో విపరీతమైన పొల్యూషన్ ఉందని తెలిపారు. తాండూర్లో తాండూర్ గెలిస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు తాండూర్ లో పాలిటెక్నిక్ కళాశాల, బీఈడీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు .తాండూర్ నియోజకవర్గం లో అభివృద్ధి పరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ ,ధారాసింగ్ అబ్దుల్ రవుఫ్, జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.