పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల

పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల

వికారాబాద్ జిల్లా: మోమిన్ పేట మండలం అమ్రవాది కుర్ధ్ గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన వైఎస్ షర్మిల. వడగండ్ల వానకు సర్వం నష్టపోయామని వైఎస్ షర్మిల. వివరించిన రైతులు

  • వికారాబాద్ జిల్లాలోనే కనీసం 6 వేల ఎకరాల పంట నష్టం జరిగింది
  • ప్రతి రైతు నష్ట పోయాడు
  • రైతులకు ప్రభుత్వం ఇచ్చే బరోసా ఎంటి..?
  • ఇంత వరకు ఒక్కరూ కూడా పరిశీలన కు రాలేదు
  • ఎంత నష్టం జరిగింది అనేది అంచనా కూడా లేదు
  • నష్ట పరిహారం పై పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు
  • ఓట్లు వేయించుకోవడానికి తప్పా రైతులు ఎలా బ్రతుకు తున్నారు అని పట్టింపు లేదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది
  • 1250 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా
  • రైతులు భయపడకండి అనే బరోసా కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి ఇవ్వలేదు
  • రెండు వారాల్లో పంట చేతికి వచ్చే సమయంలో రైతు ఆగం అయ్యాడు
  • అసలు తెలంగాణ లో ప్రతి ఏడాది పంట నష్టం జరిగితే పట్టించు కొనే దిక్కు లేదు
  • 2018 -19 లో 960కోట్ల మేర పంటనష్టం జరిగింది
  • 2019-20లో 990 కోట్ల మేర పంటనష్టం
  • 2020-21 లో 500కోట్ల మేర నష్టం
  • 2021-22లో 1000కోట్లు మేర నష్టం
  • ఇప్పుడు 1250 కోట్ల నష్టం
  • ప్రతి ఏడాది ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చింది లేదు
  • మంత్రులు వస్తారు...గాలి మోటర్లలో తిరుగుతారు
  • లెక్కలు తీస్తారు..తర్వాత మోసం చేస్తారు
  • పరిహారం ఇవ్వడానికి మాత్రం మొహం చాటేస్తరు
  • వైఎస్సార్ ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే పరిహారం తో పాటు బోనస్ కూడా ఇచ్చే వాడు
  • ఇప్పుడు రూపాయి కూడా పరిహారం ఇచ్చే దిక్కు లేదు
  • పండుగలా ఉన్న వ్యవసాయాన్ని దండుగ చేశాడు కేసీఅర్
  • మొత్తం 30 వేలు ఇచ్చే సబ్సిడీ  పథకాలు బంద్ పెట్టాడు
  • రాష్ట్రంలో కేసీఅర్ దరిద్రపు పాలనకు 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
  • రైతు గౌరవంగా బ్రతకడం లేదు
  • పంట నష్టం జరిగితే నేరుగా వచ్చి ముఖ్యమంత్రి పరిశీలన చేసింది లేదు
  • ముఖ్యమంత్రి కేసీఅర్ ను డిమాండ్ చేస్తున్నాం
  • వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి
  • 1250 కోట్లు నష్టం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
  • రైతు సంఘాలు చెప్పిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
  • తక్షణం నష్ట పరిహారం ఇవ్వాలి