తెలంగాణకు మోడీ ఒరగబెట్టిందేమీ లేదు..

తెలంగాణకు మోడీ ఒరగబెట్టిందేమీ లేదు..
  • తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
  • ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ ఫలాలు
  •  షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
  • -షాద్ నగర్ పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రమణ

షాద్ నగర్, ముద్ర: తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీలేదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎల్ఎన్ గార్డెన్స్ లో పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన భారత రాష్ట్ర సమితి పట్టణ కార్యకర్తల విస్తృతస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామణతోపాటు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రం నుంచి పన్నులను వసూలు చేసుకుంటూ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులను విడుదల చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఐటిఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారన్నారు. రాష్ట్ర బిజెపి నేతలకు ఏమాత్రం సోయి ఉన్నా వెంటనే ఐటిఐఆర్ ను ప్రారంభించాలన్నారు. తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్న ఫార్మాసిటీకీ అనుమతి ఇవ్వాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రాజెక్టుల నిర్మాణానికి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారని, కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టును పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం పాలమూరు.

రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ దొడ్డి దారిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుట్రలు చేస్తుందన్నారు. బిజెపి ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులను సైతం వదలడంలేదని తమ కుటీల రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా టెన్త్ పేపర్ లీకేజీ  చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇలాంటి చర్యలు సరికాదని, భవిష్యత్తుతో విద్యార్థులతో రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. దేశం, రాష్ట్రంలో హిందూ, ముస్లిం ఘర్షణలను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. కూల్చడం, కులమత ఘర్షణలు రేకెత్తడమీ బిజెపి ఎజెండా అన్నారు.  తెలంగాణ రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వని అసమర్ధ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అన్నారు. దేశంలో ఎన్నో ప్రాంతాలకు మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల కూడా ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలకు కెసిఆర్ కుటుంబాన్ని విమర్శించడం తప్ప తెలంగాణకు ఏదైనా మేలు చేశామని చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పటికీ తండ్రి ఆశయ సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, కవిత తెలంగాణ ఉద్యమాల్లో రాత్రింబవళ్లు పోలీసుల వేధింపులకు గురయ్యారన్నారు. ఓసారి కీసర పోలీస్ స్టేషన్ లో కవితను అర్ధరాత్రి వరకు అక్కడే పెడితే తనకు ఫోన్ చేశారని, తానే స్వయంగా స్పందించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆమెను విడిపించానన్నారు.

పేదలను దోచి పెద్దలకు పెట్టి: ఎమ్మెల్సీ..

 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదలను దోచి పెద్దలకు పెడుతుందని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. పేదోడి జేబులు నింపేందుకు కేసీఆర్ కృషి చేస్తుంటే, పేదోడి జేబులు దోచుకునేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. నిత్యావసర సరుకుల ధరలతో పాటు జీఎస్టీ ద్వారా అన్ని వస్తువులపై ధరలు పెంచి పేదోని దోచుకో తింటున్నారన్నారు. 

ప్రతి గడప కేసీఆర్ సంక్షేమ ఫలాలు..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గడపకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్, బిజెపిల నేతలు చేసే విషపు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. ముచ్చటగా మూడవసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నే కవితానారాయణయాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ప్రధాన కార్యదర్శి చిపిరి రవియాదవ్, మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ఎస్సి ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పాండురంగారెడ్డి,మాజీ జెడ్పీటీసీలు సూర్యప్రకాష్, సాయికృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, మాజీ ఎంపీపీలు బెంది శ్రీనివాస్ రెడ్డి, శివ రాములుగౌడ్, వన్నాడ ప్రకాష్ గౌడ్, ఆకుల మల్లేష్, గ్రంథాలయాల సంస్థ అధ్యక్షుడు లక్ష్మినరసిoహ్మారెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుల ఆకుల శ్రీశైలం, జమృత్ ఖాన్, ల చేగూరి వేణుగోపాల్, యాదవచారి నందారం అశోక్ యాదవ్, నర్సింగ్, గుర్రంపల్లి కృష్ణయ్య, , మున్సిపల్ కౌన్సిలర్స్ వెంకట్ రాంరెడ్డి, అగ్గనురి విశాల విశ్వం, మహేశ్వరి,  జిటి శ్రీనివాస్ ,కానుగు అంతయ్య, రేటికల్ నందీశ్వర్,  శంకర్, గడ్డం మాధురి నందకిషార్, పులిమామిడి లతశ్రీ శ్రీశైలంగౌడ్, ఈశ్వర్ రాజు, అరిఫాబేగం, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, పద్మ, గౌస్ జాని, మహిళ నేతలు రాజ్యలక్ష్మి, వన్నడ లావణ్య ప్రకాష్ గౌడ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.