సంక్షేమ పథకాలన్నీ అందాలంటే టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి తాండూర్ లో తిరిగి పైలెట్ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలి

సంక్షేమ పథకాలన్నీ అందాలంటే టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి తాండూర్ లో తిరిగి పైలెట్ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలి
  • ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  తండ్రి సీనియర్ నాయకులు పంజుగుల విట్టల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: బీద ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని అందాలంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  తండ్రి సీనియర్ నాయకులు పంజుగుల విట్టల్ రెడ్డి కోరారు.  తాండూరు మండల పరిధిలో చిట్టి ఘనపూర్, కోత్లాపూర్ గ్రామాల్లో బుధ వారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే పేతులకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. రూ. 400 కే వంట గ్యాస్ సిలిండర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలాగే తాండూర్ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో వివరించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి త్రీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తిస్థాయిలో తాండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని వివరించారు. బీ ఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. గత 20 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని రెండు సంవత్సరాల్లో చేసి చూపించిన తన కుమారుడు  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  కి అండగా ఉండి భారీ మెజార్టీని అందించాలన్నారు.