ఎమ్మెల్యే గా మరోసారి రోహిత్ రెడ్డి ని గెలిపించండి

ఎమ్మెల్యే గా మరోసారి రోహిత్ రెడ్డి ని గెలిపించండి
  • మీకు అండగా ఉంటాడు
  • తాండూరు అభివృద్ధి కి తోడ్పాడుతాడు 
  • ప్రచారం లో తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా  తాండూరు మున్సిపల్ పరిధిలోని 25వ వార్డ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రచారం లో కోరారు. వార్డ్ లో ఇంటింటికి తిరుగుతూ.... బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ  రోహిత్ రెడ్డి ని గెలిపించాలని ఆకాంక్షించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.

ఈ కార్యక్రమం లో తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న పరిమళ్, బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, పొట్లి మహారాజ్ దేవాలయ చైర్మన్ భాను, పరిమళ, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.