తెలంగాణ రాష్ట్రానికి, నిరుపేదలకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం శాపంగా మారింది

తెలంగాణ రాష్ట్రానికి, నిరుపేదలకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం శాపంగా మారింది

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం పెద్దేముల్ మండలం బాయిమీది తండా, బండమీదిపల్లి, ఉరేంటి తండా తదితర గ్రామాల్లో   తాండూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి సోమ వారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి, నిరుపేదలకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం శాపంగా మారిందని అన్నారు. పూరి గుడిసెల్లో జీవనము సాగిస్తున్న పేదల కష్టాలు నీకు కన్పించట్లేదా అని అన్నారు. నిరుపేదల పాలిట బీఆర్ఎస్ ప్రభుత్వం  శాపం గా మారిందనీ , విద్యార్థుల ఆత్మబలిదానాల మీద గద్దే ఎక్కిన కేసీఆర్ వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వారి జీవితాలని నాశనం చేస్తున్నారని అన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటుతో  ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.

అభివృద్ధి పేరుతో పార్టీ మారిన స్థానిక ఎమ్మెల్యే ఆయన మరియు కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది అని తాండూర్ నియోజకవర్గం మాత్రం అంధకారంలోకి పోయింది అని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు చూసి కాంగ్రెస్ పార్టీ లో చాలా మంది చేరుతున్నారు అన్నారు..ఏ పల్లె వెళ్లిన ఏ గడప తాటిన సమస్యలతో బాధపడుతున్న ప్రజలు కష్టాలు పడుతూ తమ గోడును తన దృష్టికి తీసుకొస్తున్నారని మనోహర్ రెడ్డి అన్నారు. గత పాలకులు ఒకే కుటుంబానికి చెందిన నాయకత్వం వహించారు... తమ కుటుంబాల అభివృద్ధి కోసం ప్రజలకు సంక్షేమం అందలేదని మీకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మనోహరన్న  అభ్యర్థించారు...గత కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, పించను,ఉద్యోగ అవకాశాలు, ప్రాజెక్టులు వంటి సంక్షేమ పథకాలు ఉండే, బిఆర్ఎస్ బిజెపి పార్టీలు పదేళ్ల అధికారంలో ఉండి చేసిందేమి లేదని ఆయన అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు దారా సింగ్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బండపల్లి గ్రామంలో 100 మంది కాంగ్రెస్ లో చేరిక బండపల్లి  గ్రామానికి చెందిన 100 మంది బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధార సింగ్ ఆధ్వర్యంలో మనోహర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.