60 ఏళ్లలో జరగని అభివృద్ధి రెండేళ్లలో చేశా

60 ఏళ్లలో జరగని అభివృద్ధి రెండేళ్లలో చేశా
  • రైతులకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే 
  • తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్.. రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.పెన్షన్ లు కట్ అయి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు బాధపడతారనీ అన్నారు.మహిళలకు ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వని దద్దమ్మ కాంగ్రెస్ అని విమర్శించారు.ప్రతి ఆడబిడ్డను సొంత ఆడబిడ్డగా చూసుకుంటున్న ప్రభుత్వం..

రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.రైతు మరణిస్తే  వారి కుటుంబం రోడ్డు పాలు కాకూడదన్న ఉద్దేశంతో రూ. ఐదు లక్షలను ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది అని అన్నారు.తాండూరు నా ఊరు.. నాకున్న ప్రేమ బయటోనికి ఉంటదా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు ఓటు వేస్తే గోసపడతాం..
ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చాను..
60 ఎండ్లలో జరగని అభివృద్ధి 2 ఎండ్ల లో జరిగింది..
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాను ఇంకా చేస్తాను..
కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోరారు.