తాండూరు అభివృద్ధి కేవలం మీ బిడ్డ రోహిత్ రెడ్డి తోనే సాధ్యం

తాండూరు అభివృద్ధి కేవలం మీ బిడ్డ రోహిత్ రెడ్డి తోనే సాధ్యం
  • మరో సారి ఆశీర్వదించి ఎమ్మెల్యే గా గెలిపించండి
  • ఎన్నికల ప్రచారం లో వికారాబాద్ జడ్పీటీసీ ప్రమోదిని దేవి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రోహిత్ రెడ్డి తల్లిగారు వికారాబాద్ జెడ్పిటిసి  ప్రమోదిని మహిళా కన్వీనర్ శంకుంతల, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మనిక్ రెడ్డి తో కలిసి బషీరాబాద్ ఏక్మయి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ... ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామా ప్రజలకు వివరించారు. మీ బిడ్డ రోహిత్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మీ బిడ్డను గెలిపించి బాధ్యత మీ అందరిపై ఉందని సూచించారు.