విపణిలోకి శామ్ సంగ్ ఎస్ 24 సిరీస్ విడుదల

విపణిలోకి శామ్ సంగ్ ఎస్ 24 సిరీస్ విడుదల
  • బంజారాహిల్స్ హ్యాఫీ మొబైల్స్ లో శ్రీలీల సందడి..అభిమానుల కోలాహలం
  • నిత్యజీవితంలో బాగమైన ఫోన్ వినియోగం : నటి శ్రీలీల

హైదరాబాద్ , ఫిబ్రవరి 2024 స్మార్ట్ ఫోన్ ల తయారి సంస్ధ శామ్ సంగ్ తమ సరికొత్త గెలాక్సీ ఎస్ 24 సిరీస్ ను బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12 జంక్షన్ లో గల హ్యాఫి మొబైల్స్ వేదికగా టాలీవుడ్ నటి శ్రీలీల ఆదివారం నాడు సాయంత్రం హాఫీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ సంస్ధ సి.యం.డి క్రిష్ణ పవన్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్, ఉపాధ్యక్షులు శరణ్ శ్రీహర్ష్ , శామ్ సంగ్ మార్కెటింగ్ హెడ్ యం.ఎక్స్ ఎమ్మార్ సౌత్ బాలాజీ, శామ్ సంగ్ కీ అకౌంట్స్ మేనేజర్ శన్ముక్ లతో కలిసి హైదరాబాద్ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాంతమంతా కోలాహలంగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఆమె తన అభిమానులకు హ్యాఫీ ఈవినింగ్ అంటూ అభివాదం చేస్తూ..మరింత ఉత్సాహ పరిచారు.

ఈ సందర్బంగా నటి శ్రీలీల మాట్లాడుతూ తెలంగాణ లో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న హ్యీఫీ మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్ ద్వారా శామ్ సంగ్ ఎస్ 24 సిరీస్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచం లో ఎక్కడా ఉన్నా మొబైల్ ఫోన్ వ్యవస్థ మానవ సంబంధాలకు చేరువలో ఉంచుతోందన్నారు. 

 హ్యాఫీ మొబైల్స్ సంస్ధ సి.యం.డి క్రిష్ణ పవన్ మాట్లాడుతూ వినియోగదారుల ఆధరాభిమానాలతో తెలంగాణలో తమ సేవలను విస్తరిస్తూ వస్తుందని, త్వరలో మరిన్ని స్టోర్ లను లాంచ్ చేయనున్నట్లు వివరించారు. వాలెంటైన్ ఆఫర్ గా సెలెక్టడ్ మొబైల్ ఫోన్ లపై యాభై శాతం, యాక్ససెరీస్ పై 70 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక యాక్ససెరీస్ లో కోంబో ఆఫర్ లో 143 రూపాయల నుండి 1430 రూపాయలకు అందిస్తున్నామని, ఎల్.ఇ.డి లు 7999, ల్యాఫ్ టాప్లు ప్రారంభం ధర18,999 అందుబాటులో ఉంచామని వివరించారు. 

ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లప్పుడూ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ ప్రొడక్ట్స్ తో పాటు యాక్ససెరీస్ ను అందిస్తుందన్నారు. శాంసంగ్ ఎస్ 24 సిరీస్ లో అబ్బుర పరిచే అధునాతన ఫీచర్లు ఉన్నాయని, ఇప్పటికే వినియోగదారులు వీటి కోనగోలు కోసం హ్యాఫీకి తరలి వస్తున్నారని అన్నారు.