భారత్​బిలియనీర్లలో అగ్రస్థానంలో సావిత్రి జిందాల్​

భారత్​బిలియనీర్లలో అగ్రస్థానంలో సావిత్రి జిందాల్​

సిటీ ఇండెక్స్ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం మహిళా బిలియనీర్ల విషయంలో అన్ని దేశాలను వెనక్కి నెట్టి అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.  అమెరికాలో మొత్తం 92 మంది బిలియనీర్ మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో చైనా పేరు రెండవ స్థానంలో ఉంది. చైనాలో మహిళా బిలియనీర్ల సంఖ్య 42.  ఈ జాబితాలో జర్మనీ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 32 మంది బిలియనీర్ మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఇటలీ  నాలుగో స్థానంలో ఉంది. ఈ దేశంలో మొత్తం మహిళా బిలియనీర్ల సంఖ్య 16. మహిళా బిలియనీర్ల విషయంలో ఆస్ట్రేలియా, హాంకాంగ్‌లతో పాటు భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈ దేశాలన్నింటిలో మహిళా బిలియనీర్ల సంఖ్య 9. హాంకాంగ్‌లోని జౌ కున్‌ఫీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మహిళగా నిలిచారు. ఆమె టచ్ స్క్రీన్ లెన్స్ కంపెనీ యజమాని. ఆమె వ్యక్తిగత సంపద 6.6 బిలియన్ డాలర్లు.  భారతదేశంలోని మహిళా బిలియనీర్ల విషయానికి వస్తే జిందాల్ గ్రూప్ యజమాని, రాజకీయవేత్త సావిత్రి జిందాల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. సావిత్రి జిందాల్, ఆమె కుటుంబం మొత్తం సంపద 16.96 బిలియన్ డాలర్ల కంటే అధికం. ఈ జాబితాలో లీనా తివారీ, ఫల్గుణి నయ్యర్, స్మితా కృష్ణ షా గోద్రెజ్, అను అగా, కిరణ్ మజుందార్-షా తదితర మహిళా బిలియనీర్లు కూడా ఉన్నారు.