Top 10 richest Indian in the world ప్రపంచంలోని టాప్ 10 సంపన్నులలో భారతీయుడు ముఖేష్ అంబానీ

Top 10 richest Indian in the world ప్రపంచంలోని టాప్ 10 సంపన్నులలో భారతీయుడు ముఖేష్ అంబానీ

గత కొన్ని నెలలుగా గౌతమ్ అదానీ నెట్‌వర్త్ భారీగా క్షీణించడం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ కూడా లాభపడ్డారు. దీని కారణంగా ముఖేష్ అంబానీ మళ్లీ భారతదేశం, ఆసియాలో అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ప్రపంచంలోని 10 మంది ధనవంతులలో ఉన్న ఏకైక భారతీయుడు. హురున్ సంపన్నుల తాజా జాబితాలో ఈ సమాచారం బయటకు వచ్చింది. రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ హురున్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎం3ఎమ్‌తో కలిసి ధనికుల జాబితాను విడుదల చేసింది.

ది 2023 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం.. ముఖేష్ అంబానీ భారతదేశం, ఆసియాలో అత్యంత ధనవంతుడు మాత్రమే కాదు.. ప్రపంచంలోని 10 మంది ధనవంతుల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడు కూడా.  ముఖేష్ అంబానీ నికర విలువ ఇప్పుడు 82 బిలియన్ డాలర్లు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గత ఏడాది హురున్ జాబితాలో భారతీయ సంపన్నులలో మొదటి స్థానంలో ఉండగా, అతని తర్వాత ముఖేష్ అంబానీ రెండవ స్థానంలో ఉన్నారు. గతేడాది జాబితా ప్రకారం.. గౌతమ్ అదానీ నికర విలువ దాదాపు 130 బిలియన్ డాలర్లు. అయితే ఇప్పుడు అతని నికర విలువ $53 బిలియన్లకు పడిపోయింది. నికర విలువలో సగానికి పైగా క్షీణించినప్పటికీ గౌతమ్ అదానీ ఇప్పటికీ రెండవ సంపన్న భారతీయుడు.