లులు మాల్ లో ఈ నెల 29 నుంచి బ్యూటీ ఫెస్ట్ 2023

లులు మాల్ లో ఈ నెల 29 నుంచి బ్యూటీ ఫెస్ట్ 2023

టైటిల్స్ విజేతలకు నగదు బహుమతులు 
హైదరాబాద్, ముద్ర : లులు హైదరాబాద్ తెలంగాణాలో అతిపెద్ద బ్యూటీ ఫెస్ట్‌ని నిర్వహిస్తోంది 'లులు బ్యూటీ ఫెస్ట్ 2023' కోసం రిజిస్ట్రేషన్‌లు  ప్రారంభమయ్యాయని కంపెనీ ఒక ప్రకటనలో  తెలిపింది  'లులు యార్డ్లీ బ్యూటీ క్వీన్'  'లులు నివియా మ్యాన్ ఆఫ్ ది ఇయర్' టైటిల్స్ విజేతలు 2 లక్షల రూపాయల విలువైన నగదు బహుమతులు పొందుతారు. ఈ పోటీలకు 18 నుండి 25 సంవత్సరాల వయస్సు కలవారు  అర్హులు. నైపుణ్యం, సృజనాత్మకతను ప్రదర్శనకు ఈ ఈవెంట్​ వేదిక కానుంది.

నాలుగు రోజుల ఈవెంట్ నవంబర్ 29 న ప్రారంభమవుతుంది. www.lulubeautyfest.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి.   నమోదు ఉచితం. దేశంలోని ప్రముఖ షో డైరెక్టర్లలో ఒకరు ఈ  ఈవెంట్ కు నాయకత్వం వహిస్తారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన పోటీదారులు అధికారిక ఎంట్రీ కార్డ్‌ని అందుకుంటారు. గ్రాండ్ ఫినాలేలో పదిహేను మంది పురుషులు మరియు మహిళలు షార్ట్‌లిస్ట్ చేయబడి  టైటిల్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది.